బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
NLG: కేతేపల్లి మండలం బండపాలెంకు చెందిన మారం రేణుక మృతి చెందగా, వారి పార్థివ దేహానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నకిరేకల్ పట్టణానికి చెందిన కాసుల మధు రోడ్డు ప్రమాదంలో మరణించగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ ఆపద కాలంలో ఆయా కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.