విద్యార్థులతో కలసి భోజనం చేసిన ఎమ్మెల్యే
NTR: జి.కొండూరు జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును, వంటశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్కూల్ టీచర్లు, సిబ్బందితో కలిసి వంట గదిని, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు.