నత్తల తాకిడికి నష్టపోతున్న రైతులు

నత్తల తాకిడికి నష్టపోతున్న రైతులు

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామంలో ఆఫ్రికన్ నత్తలు రైతులకు దడ పుట్టిస్తున్నాయి. వందల ఎకరాల్లో నత్తల దాటికి వంగ, టమాటా, మిర్చి, బొప్పాయి రైతులు నష్టపోతున్నారు. వర్షాలకు నత్తల గుడ్లు కొట్టుకొచ్చి ఆ గుడ్లు ఇక్కడ నత్తల సంతతి పెరగడానికి కారణంగా అధికారులు గుర్తించారు. దీనిపై జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బాలాజీ కుమార్ సరైన చర్యలు తీసుకుంటే నివారించవచ్చని పేర్కొన్నారు.