సాయి శ్రేయాస్ ఫార్మా కంపెనీలో ఉత్పత్తి పునఃప్రారంభం
AKP: పరవాడ సాయి శ్రేయాస్ ఫార్మా కంపెనీలో 20 రోజుల కిందట ఉత్పత్తిని పునః ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 11వ తేదీన విషవాయువులు పీల్చిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. దీంతో కంపెనీని మూసివేశారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతి ఇవ్వడంపై మానవ హక్కుల వేదిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.