ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే
CTR: నగరి మండలం వి.కె.ఆర్ పురంలో వినాయక ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఆలయం కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలకగా.. అర్చకులు తీర్థ ప్రసాదం అందజేశారు.