ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
SKLM: నరసన్నపేట మండలం మాకివలసలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యులు విజయ్ కుమార్ గ్రామంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.