పోలీసుల నిర్లక్ష్యంపై స్పందన తల్లిదండ్రుల ఆవేదన
ATP: ఆకతాయి వేధింపులపై ఫిర్యాదు చేసినా చెన్నేకొత్తపల్లి పోలీసులు స్పందించకపోవడంతోనే తమ కుమార్తె స్పందన (17) బలవన్మరణానికి దారితీసిందని తల్లిదండ్రులు కన్నీళ్లతో వాపోయారు. బస్సులో యువకుడి వేధింపులపై చర్యలు తీసుకుంటే తన బిడ్డ బ్రతికి ఉండేదని, పోలీసుల నిర్లక్ష్యమే తమకు అపార నష్టం మిగిలించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.