డీజీపీ శివధర్‌రెడ్డికి మంత్రి పొన్నం లేఖ
TG: డీజీపీ శివధర్‌రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటనలు ప్రాంతీయ కలహాలను పెంచుతాయని అన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించాలని కోరారు. శాంతిసామరస్యాలను కాపాడాలన్నారు.