నేడు నగరంలో యూనిటీ మార్చ్
NZB: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఈనెల 18న యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు మై భారత్ కో–ఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటలకు నగరంలోని వర్ని చౌరస్తాలో గల సర్దార్ పటేల్ చౌక్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, కోర్టు సర్కిల్ మీదుగా పాత కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగుతుందన్నారు.