VIDEO: ప్లాష్టిక్ డబ్బాలో ఇరుక్కున్న శునకం తల
KDP: బద్వేల్లో ఆహారం కోసం వెతికిన ఓ శునకం ప్రాణాపాయ స్థితిలో పడింది. తిండి కోసం డబ్బాలో తల పెట్టగా.. అది గట్టిగా ఇరుక్కుపోయింది. దాని అగచాట్లు చూసిన కొందరు సాయం చేయాలని ఉన్నా కరుస్తుందేమోనని భయంతో ముందుకు రాలేదు. ఇంకొందరు ధైర్యం చేసి ప్రయత్నించినా బయటకు తీయలేకపోయారు. దీంతో ఆ శునకం తిండి, నీరు లేక తల్లడిల్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.