ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
VSP: గాజువాక టీడీపీ కార్యాలయంలో గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కొన్నింటిని అక్కడక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.