'కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి'

CTR: కోవిడ్ పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని డాక్టర్ చందన ప్రియ తెలిపారు. పలమనేరులోని కాకాతోపు అర్బన్ హెల్త్ సెంటర్‌లో సోమవారం పారా మెడికల్ సిబ్బందితో సమావేశమైయ్యారు. 2019లో కోవిడ్ బారిన పడి ఎన్నో కుటుంబాలు మృత్యువాత పడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.