గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు లేవు: నాదెండ్ల

గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు లేవు: నాదెండ్ల

AP: రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేవని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులో చర్చించామని, పైప్‌లైన్ ద్వారా గెయిల్ నుంచి సరఫరాపై దృష్టి సారించామన్నారు. రోజుకు 3 లక్షలపైగా గ్యాస్ డెలివరీలు జరుగుతున్నాయని, ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరారు. ప్రజలు ఆందోళనతో ముందస్తు బుకింగ్స్ చేయవద్దని, రీఫిల్ బుకింగ్‌కు సమయం ఇవ్వాలని సూచించారు.