తల్లిదండ్రుల మందలింపుతో బాలుడు ఆత్మహత్య

తల్లిదండ్రుల మందలింపుతో బాలుడు ఆత్మహత్య

కృష్ణా: బాపులపాడు(M)లో చోటుచేసుకున్న విషాద ఘటన ప్రజల మనసులను కలచివేస్తోంది. మండలానికి చెందిన ఓ బాలుడు (15) పాఠశాలకు వెళ్లడం లేదన్న కారణంగా తల్లిదండ్రులు మందలించగా, క్షణికావేశంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో తల్లిదండ్రులు సమీప ఆసుపత్రికి చేర్చగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.