షెడ్యూల్ కులాల విద్యార్థులకు శుభవార్త..!
BHPL: జిల్లాలోని షెడ్యూల్ కులాల నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పన కోసం అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 17 నుంచి 23 వరకు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.