సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన కోటంరెడ్డి
NLR: 24 మంది పేదలకు రూ.16 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధిదారులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్ధిక స్థోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి సంజీవినిలా నిలుస్తోందన్నారు.