CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల

కోనసీమ: సీఎం సహాయనిధి పేదలకు ఒక వరం లాంటిదని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో 159 మంది లబ్ధిదారులకు మంజూరైన 87 లక్షల రూపాయల CMRF చెక్కులను మురమళ్ళ కార్యాలయంలో పంపిణి చేశారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.