పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
KMM: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాదేవపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల చీరలు ధరించి, ఉపాధ్యాయులుగా మారి, బోధనోపకరణాలతో పాఠ్యాంశాలను బోధించారు.