సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
VZM: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డీపీపీవో జి.వరలక్ష్మి పత్రిక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, ఎస్.కోట డిపోల నుండి జనవరి 8 నుండి14వ తేది వరకు ప్రతీ రోజు విజయవాడ, భీమవరం, రాజోలు మరియు విశాఖపట్నంకి ప్రత్యేక బస్సులు నడుపుటకు తెలిపారు. ప్రయాణికులు www.apsrtconline.in ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు.