నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు స్టాపింగ్

ATP: గుంతకల్లు మీదుగా బెంగళూరు-నాందేడ్-బెంగళూరు మధ్యన నడిచే ఎక్స్ ప్రెస్ (16593/94) రైలుకు నగరూరు రైల్వే స్టేషన్లో స్టాపింగ్ కల్పించ నున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు-ఆదోని రైల్వే సెక్షన్లో ఉన్న నగరూరు స్టేషన్లో నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రయోగాత్మకంగా ఒక నిమిషం నిలపనున్నట్లు తెలియజేశారు.