శ్రీవారి అభిషేక సేవలో డైరెక్టర్ బాబీ
TPT: దర్శకుడు బాబీ, నేషనల్ మెడికల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేథ్, తదితరులు శుక్రవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకున్నారు. వారిద్దరూ నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో రవిచంద్ర స్వామి వారి శేష వస్త్రంతో వారిని సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.