నంద్యాల పంప్ హౌస్ వద్ద మంత్రి సమావేశం

నంద్యాల పంప్ హౌస్ వద్ద మంత్రి సమావేశం

NDL: నంద్యాల పట్టణ పరిధిలోని మహానంది వైపు వెళ్లే రహదారిలో ఉన్న పంప్ హౌస్ వద్ద మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంప్ హౌస్ నిర్వహణ, నీటి సరఫరా వ్యవస్థ, సామర్థ్యం, పట్టణ మౌలిక వసతులపై అధికారులతో ఆయన చర్చించారు. పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.