రేపు జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్
JGL: రేపు మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంటికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఆయనతోపాటు మాజీమంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్ కూడా రానున్నారు. BRS పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తుంది. కాగా.. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వేళ ఈ సమావేశం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.