VIDEO: గ్రానైట్ క్వారీ కార్మికుడు మృతి

VIDEO: గ్రానైట్ క్వారీ కార్మికుడు మృతి

SKLM: టెక్కలి(M) రావివలసలోని గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న కార్మికుడు ఎర్రయ్య (48) బుధవారం అస్వస్థతకు గురై మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. మధ్యాహ్నం భోజనం అనంతరం అతడు ఒక్కసారిగా కుప్ప కూలాడు. సహచరులు అతన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.