VIDEO: ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా ఓర్వకల్లు: మంత్రి

VIDEO: ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా ఓర్వకల్లు: మంత్రి

కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్ గార్డెన్‌ను రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రఖ్యాత రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తోందని వెల్లడించారు. వివిధ ఆకృతులతో కూడిన రాళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని వెల్లడించారు.