'ఉచిత విత్తనాలు సద్వినియోగం చేసుకోండి'

KDP: జాతీయ ఆహార భద్రత పథకం కింద ఉచితంగా ఇస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకుడు రామ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కొలవలి గ్రామంలో ఏవో వెంకట కృష్ణారెడ్డి రైతులకు ఉచితంగా విత్తనాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు తప్పకుండా పంట నమోదు చేయించుకోవాలన్నారు.