ఇంటర్ ద్వితీయ పరీక్షలకు నలుగురు గైర్హాజరు
KMR: బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. మ్యాథ్స్, బొటనీ, పొలిటికల్ సైన్స్, తదితర పరీక్షలు జరిగినట్లు అధికారులు తెలిపారు. 282 మంది విద్యార్థులకు 278 మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.