కామారెడ్డి గిరిజన గురుకులంలో విద్యార్థికి పాముకాటు
KMR: జిల్లా కేంద్రంలోని సారంపల్లి శివారులో గల గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బానోత్ చరణ్ మంగళవారం ఉదయం పాముకాటుకు గురయ్యాడు. టీ బ్రేక్ సమయంలో పాఠశాల మైదానంలోకి వెళ్లిన విద్యార్థి ఎడమ పాదంపై పాము కరిచింది. వెంటనే స్పందించిన సిబ్బంది అతన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి (GGH) తరలించారు.