భర్త మానసిక వేధింపులతో భార్య ఆత్మహత్య

భర్త మానసిక వేధింపులతో భార్య ఆత్మహత్య

KRNL: భర్త వేధింపులు తాళలేక అంజలి (23) అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నన్నూరుకు చెందిన తిరుమలేష్ మద్యం తాగి భార్యను మానసికంగా వేధించడంతో, అంజలి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దించి, పోలీసులకు సమాచారం అందించారు.