బాధిత కుటుంబానికి రూ.2.5 లక్షల LOC అందజేత..

BHPL: కాటారం మండలం గారేపల్లికి చెందిన సబ్బాని దివ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.2.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. అనారోగ్యంతో బాధపడుతున్న దివ్య, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సహాయం కోరగా, ఆయన స్పందించి బుధవారం హైదరాబాద్‌లో ఆమె కుటుంబానికి చెక్కు అందజేశారు.