VIDEO: ఘనంగా పోలేరమ్మ తల్లి మహోత్సవాలు

గుంటూరులోని చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద పొంగళ్ల మహోత్సవాలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఈ మహోత్సవాలను కొనసాగిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 108 బిందెలతో అభిషేక పూజలు జరిగాయి. అనంతరం రథోత్సవంలో అమ్మవారిని అంగరంగ వైభవంగా మేళ తాళాల నడుమ ఊరేగించారు. సాంస్కృతిక, వేషధారణలతో భక్తులను అలరించారు.