అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఫీనిక్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఎల్ కమెరూన్ జైగాంటే మారిస్కోస్ అండ్ స్టేక్ హౌస్ అనే రెస్టారెంటులో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.