ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డీఈఓ

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డీఈఓ

SKLM: టెక్కలి మండలం పోలవరం ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.తిరుమలచైతన్య సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చే విధంగా తల్లిదండ్రులకు అవగాహాన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంతకు ముందు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.