'మద్యం షాపులో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు'
VZM : మద్యం దుకాణాలలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని విజయనగరం జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి శ్రీ నాథుడు హెచ్చరించారు. శనివారం దావాలో పెట్టలోని ఫ్రెండ్స్ వైన్ షాప్‌లో తనిఖీలు నిర్వహించి సురక్ష యాప్ ద్వారా మద్యం నాణ్యతను పరిశీలించారు. ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. సీఐ జనార్దనరావు, ఎస్సైలు పాల్గొన్నారు.