VIDEO: సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్‌గా నివేదితా?
SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ 46వ వార్డు నుంచి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించిన మొరిశెట్టి నివేదితా లక్ష్మారెడ్డికి పట్టాభిషేకం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆమె మాట్లాడుతూ.. 'మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సేవ చేసే అవకాశం కల్పిస్తే, పట్టణ రూపురేఖలు మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను' అని ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపుకు సహకరించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.