గ్రామ దేవతల పండుగ నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కమిషనర్
VZM: పాతబొబ్బిలి సరే పోలమ్మతల్లి, గొల్లపల్లి తల్లి గ్రామ దేవతల పండగలు నేపథ్యంలో బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ రామలక్ష్మి ఆదివారం తెలిపారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆక్రమణల తొలగింపునకు పటిష్ట చర్యలు తీసుకున్నామని, అత్యవసర సేవలకు 9949661120 నంబరుకు సంప్రదించాలని సూచించారు.