ఆధార్ డ్రైవ్ కేంద్రంను పరిశీలించిన MPDO

SKLM: టెక్కలి మండలం స్థానిక సచివాలయం 2 నందు జరుగుచున్న ఆధార్ డ్రైవ్ కార్యక్రమంను మంగళవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి సి.హెచ్. లక్ష్మీబాయి పరిశీలించారు. ఈ ఆధార్ డ్రైవ్‌లు టెక్కలి మండలం నందు లింగాలవలస, చాకిపల్లి, టెక్కలి సచివాలయం 2 నందు వున్నట్లు ఆమె తెలియజేసారు. ఈ ఆధార్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.