కొమరోలు పాఠశాల ఆవరణలో పాములు
ప్రకాశం: కొమరోలు మండలం రాజుపాలెం కస్తూరిబా గాంధీ విద్యాలయంలో శుక్రవారం రెండు పాములు కనిపించాయి. సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ ప్రసాద్ అక్కడికి చేరుకుని పాములను బంధించారు. వాటిని స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రసాద్ తెలిపారు.