ఆర్పీ కుటుంబానికి వాసుపల్లి చేయూత

VSP: తూర్పు కాపుకు చెందిన ఆర్పీ కుటుంబాన్ని పరామర్శించిన విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన సొంత నిధులతో రూ.5000 బుధవారం అందించారు. భర్త వెంకట్రావు కిడ్నీ వ్యాధితో మృతి చెందడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన కుటుంబానికి ధైర్యం చెప్పారు. పేద ప్రజలకు తోచిన సహాయం చేయడం తన బాధ్యతగా వాసుపల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.