మణిపూర్‌లో రాకెట్ దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి
మణిపూర్‌లో రాకెట్ దాడి జరిగింది. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. వారి తల్లి బినిత ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో లోయ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రం బయట విధులు నిర్వహిస్తున్న BSF కానిస్టేబుల్ ఓయినం మాలెంన్గాన్బా నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.