పలు రాష్ట్రాల్లో SIR గడువును పెంచిన ఈసీ

పలు రాష్ట్రాల్లో SIR గడువును పెంచిన ఈసీ

ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. SIR గడువును వారంపాటు పెంచుతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు డిసెంబర్ 4న ముగిసే SIR ప్రక్రియను డిసెంబర్ 11 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో SIRను ఈసీ చేపడుతున్న విషయం తెలిసిందే.