ఈనెల 13వ తేదీన జిల్లాలో ర్యాలీ
VZM : జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాలు సేకరణలో భాగంగా ఈనెల 13వ తేదీన జిల్లాలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేస్తామని తెలిపారు.