ఆత్మకూరులో ఈనెల 12న జాబ్ మేళా
NDL: ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న జాబ్ మేళా జరగనుందని, 10 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని జిల్లా నైపుణ్యా భివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఆపై చదివిన 18 నుంచి 30 ఏళ్ల వయసు గల వారు అర్హులని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.