'జిల్లాలో 91.37 శాతం మందికి పింఛన్లు పంపిణీ'
అనకాపల్లి: జిల్లాలో 91.37 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. మొత్తం 2,53,987 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,32,077 మందికి పంపిణీ చేశామన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈనెల 2వ తేదీన వారికి పింఛన్లను పంపిణీ చేస్తామన్నారు.