'పంచాయతీ ఎన్నికల కోసం ఐక్యతతో పని చేయాలి'
ASF: గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అందరు ఐక్యతతో పని చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. శుక్రవారం జైనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలనీ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు ఉంటుందన్నారు.