జిల్లాలో ఏడుగురు మైనర్ల తల్లిదండ్రులకు జరిమానా

KMM: మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు ఏడుగురు మైనర్ల తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి.నాగలక్ష్మీ తీర్పు వెల్లడించారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహించగా.. వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో తీర్పునిచ్చారు.