భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలను తీసుకోవాలి

భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలను తీసుకోవాలి

కోనసీమ: అల్లవరం మండలంలోని కొమరగిరిపట్నం గ్రామంలో 12 మంది దళిత కుటుంబాలకు చెందిన భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన అల్లవరం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ నాయకులతో కలిసి మంగళవారం నిరసన చేపట్టారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు.