ఉప్పల్‌లో పెరుగుతున్న కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లు..!

ఉప్పల్‌లో పెరుగుతున్న కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లు..!

మేడ్చల్: ఉప్పల్ సర్కిల్- 2 పరిధిలో నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. వీటిలో ఇప్పటికే 16,600 దరఖాస్తులను ఆమోదించారు. దాదాపు 84 మంది సిబ్బంది ఎక్కడికక్కడ పని చేసి వాటిని విచారిస్తున్నట్లు వివరించారు.