కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే
VKB: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 20 మంది సర్పంచ్‌లతో ఆయన సమావేశమయ్యారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, రుణమాఫీ వంటి పథకాలు పేదలకు అందుతున్నాయన్నారు. పరిగి మీదుగా రైల్వే ట్రాక్ ఏర్పాటుకు సర్వే పూర్తయిందని, త్వరలోనే నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు.