ఐదవ వార్డులో పర్యటించిన తొర్రూరు మున్సిపల్ చైర్మన్

ఐదవ వార్డులో పర్యటించిన తొర్రూరు మున్సిపల్ చైర్మన్

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 5వ వార్డులో ఇవాళ మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ పర్యటించారు. మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య పనులపై వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అన్ని వార్డులలో మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య పనులను తక్షణమే పూర్తి చేయాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్‌కు సూచించారు.